Menu

ఎస్తేరు 10

IRV

1 రాజైన అహష్వేరోషు తన రాజ్యం మీదా సముద్ర తీర ప్రాంతాల మీదా పన్ను విధించాడు. 2 అతని బలప్రభావాల మూలంగా కలిగిన విజయాల గురించీ, రాజు మొర్దెకైని గొప్ప పదవుల్లో ఉంచిన కారణంగా మొర్దెకై ఎంత ఘనత పొందాడో ఆ విషయాల గురించీ మాదీయుల, పారసీకుల రాజ్య సమాచార గ్రంథంలో రాశారు. 3 యూదుడైన మొర్దెకై అహష్వేరోషు రాజు తరువాతి స్థానంలో ఉన్నాడు. అతడు యూదుల్లో గొప్పవాడుగా తన జాతి వారి మధ్య ప్రఖ్యాతి గాంచిన వాడయ్యాడు. అతడు తన ప్రజల క్షేమాన్ని పట్టించుకొంటూ తనవారందరితో శాంతిపూర్వకంగా మాట్లాడుతూ ఉండేవాడు.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate