Menu

కీర్తనలు 133

IRV

1 చూడండి, సోదరులు ఐక్యంగా కలసి ఉండడం ఎంత మంచిది! ఎంత రమ్యమైనది! 2 అది ఆహరోను తలమీద పోసిన పరిమళ తైలం వంటిది. అది అహరోను గడ్డం నుండి అతడి అంగీ అంచులదాకా కారుతూ ఉన్న పరిమళ తైలం వంటిది. 3 అది సీయోను కొండల మీదికి దిగి వచ్చే హెర్మోను పర్వతం మంచులాంటిది. అక్కడ ఆశీర్వాదం ఉంటుందనీ అది శాశ్వతంగా నిలిచి ఉండే జీవమనీ యెహోవా సెలవిచ్చాడు.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate