Menu

కీర్తనలు 1

OTSA

1 దుష్టుల సలహాను పాటించక పాపులు కోరుకునే మార్గంలో నిలబడక ఎగతాళి చేసేవారి గుంపుతో కూర్చోక, 2 యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ, రాత్రింబగళ్ళు దాన్ని ధ్యానిస్తూ ఉండేవారు ధన్యులు. 3 వారు నీటికాలువల ప్రక్కన నాటబడి, ఆకులు వాడిపోకుండ, సరియైన కాలంలో ఫలమిచ్చే చెట్టులా ఉంటారు వారు చేసేవాటన్నిటిలో వృద్ధిచెందుతారు. 4 అయితే దుష్టులు అలా ఉండరు! వారు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు. 5 కాబట్టి న్యాయతీర్పులో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలబడరు. 6 నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు, దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తుంది.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate