Menu

కీర్తనలు 100

OTSA

1 భూలోకమంతా యెహోవాను స్తుతిస్తూ ఆనంద ధ్వనులు చేయాలి. 2 సంతోష పూర్వకంగా యెహోవాను సేవించండి; పాడుతూ ఆయన సన్నిధిలోకి రండి. 3 యెహోవాయే దేవుడని గ్రహించండి. ఆయనే మన సృష్టికర్త, మనం ఆయన వారం; మనం ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం. 4 కృతజ్ఞతతో ఆయన ద్వారాల గుండా ప్రవేశించండి, స్తుతితో ఆయన ఆవరణంలోకి ప్రవేశించండి; ఆయనకు వందనాలు చెల్లించండి, ఆయన నామమును స్తుతించండి. 5 యెహోవా మంచివారు ఆయన మారని ప్రేమ శాశ్వతమైనది; ఆయన నమ్మకత్వం తరతరాలకు ఉంటుంది.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate