Menu

కీర్తనలు 11

OTSA

1 నేను యెహోవాను ఆశ్రయించాను. “పక్షిలా మీ కొండ మీదికి పారిపో. 2 దుష్టులు తమ విల్లును ఎక్కుపెట్టారు, చీకటిలో పొంచి ఉండి యథార్థ హృదయుల పైకి వేయడానికి బాణాలు సిద్ధం చేస్తున్నారు. 3 పునాదులు నాశనమై పోతుంటే, నీతిమంతులు ఏం చేయగలరు?” అని నాతో మీరెలా అంటారు? 4 యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నారు; యెహోవా తన పరలోక సింహాసనంపై ఆసీనులై ఉన్నారు; ఆయన భూమి మీద నరులను పరిశీలిస్తున్నారు; ఆయన కళ్లు వారిని పరీక్షిస్తున్నాయి. 5 యెహోవా నీతిమంతులను పరీక్షిస్తారు, కాని దుష్టులను, దౌర్జన్యాన్ని ప్రేమించేవారిని ఆయన అసహ్యించుకుంటారు. 6 దుష్టుల మీద ఆయన నిప్పు కణాలు అగ్ని గంధకం కురిపిస్తారు; వడగాలి వారి భాగం అవుతుంది. 7 యెహోవా నీతిమంతుడు, ఆయన న్యాయాన్ని ప్రేమిస్తారు; యథార్థవంతులు ఆయన ముఖాన్ని చూస్తారు.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate