Menu

కీర్తనలు 111

OTSA

1 యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలో సమాజంలో నేను హృదయమంతటితో యెహోవాను స్తుతిస్తాను. 2 యెహోవా కార్యాలు గొప్పవి; వాటిలో ఆనందించే వారందరు వాటి గురించి ధ్యానిస్తారు. 3 ఆయన క్రియలు కీర్తనీయమైనవి ప్రభావవంతమైనవి, ఆయన నీతి నిరంతరం ఉంటుంది. 4 మనుష్యులకు జ్ఞాపకముండేటట్లు ఆయన అద్భుతాలు చేస్తారు; యెహోవా దయామయుడు. కనికరం గలవారు. 5 భయభక్తులు గలవారిని పోషిస్తారు. ఆయన తన నిబంధన ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటారు. 6 తన ప్రజలకు ఇతర దేశాలను వారసత్వంగా ఇచ్చి, తన క్రియలలోని బలప్రభావాలను వారికి వెల్లడించారు. 7 ఆయన చేతుల పనులు విశ్వసనీయమైనవి న్యాయమైనవి; ఆయన కట్టడలు నమ్మదగినవి. 8 అవి శాశ్వతంగా స్థాపించబడ్డాయి, నమ్మకత్వంతో యథార్థతతో అవి చేయబడ్డాయి. 9 ఆయన తన ప్రజలకు విమోచన సమకూర్చారు; ఆయన తన ఒడంబడికను శాశ్వతంగా నియమించారు, ఆయన నామం పరిశుద్ధమైనది భీకరమైనది. 10 యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం; ఆయన కట్టడలను పాటించేవారు మంచి గ్రహింపు కలిగి ఉంటారు. స్తుతి నిత్యం ఆయనకే చెందును.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate