Menu

కీర్తనలు 13

OTSA

1 యెహోవా, ఎంతకాలం నన్ను మరచిపోతారు? ఎంతకాలం మీ ముఖాన్ని నా నుండి దాచిపెడతారు? 2 ఎంతకాలం నా ఆలోచనలతో నేను పెనుగులాడాలి? ఎంతకాలం నా హృదయంలో నేను దుఃఖపడాలి? ఎంతకాలం నా శత్రువు నాపై విజయం సాధిస్తాడు? 3 యెహోవా నా దేవా, నన్ను చూసి జవాబివ్వండి, నా కళ్లకు వెలుగివ్వండి, లేకపోతే నేను మరణంలో నిద్రపోతాను. 4 “మేము అతన్ని ఓడించాము” అని నా శత్రువులు చెప్పుకోనివ్వకండి, నేను పడిపోయినప్పుడు నా శత్రువులను ఆనందించనివ్వకండి. 5 అయితే నేను మారని మీ ప్రేమను నమ్ముతున్నాను; మీ రక్షణలో నా హృదయం సంతోషిస్తుంది. 6 యెహోవా నా మీద దయ చూపారు, కాబట్టి నేను ఆయనకు స్తుతి పాడతాను.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate