Menu

కీర్తనలు 131

OTSA

1 యెహోవా, నా హృదయం గర్వం కలిగిలేదు, నా కళ్లు అహంకారం కలిగిలేవు. నేను గ్రహించలేని గొప్ప విషయాలను నాకు అసాధ్యమైన విషయాలను నేను పట్టించుకోను. 2 పాలు విడచిన బిడ్డ సంతృప్తిగా ఉన్నట్లు, అవును, పాలు విడచిన బిడ్డ తన తల్లి ఒడిలో సంతృప్తిగా ఉన్నట్లు, నన్ను నేను నెమ్మదిపరచుకొని ప్రశాంతంగా ఉన్నాను. 3 ఓ ఇశ్రాయేలు, ఇప్పటినుండి నిరంతరం యెహోవా పైనే నీ నిరీక్షణ ఉంచు.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate