Menu

కీర్తనలు 54

OTSA

1 ఓ దేవా, మీ నామమును బట్టి నన్ను రక్షించండి; మీ బలాన్నిబట్టి శిక్షా విముక్తిని చేయండి. 2 ఓ దేవా! నా ప్రార్థన వినండి; నా నోటి మాటలను ఆలకించండి. 3 అపరిచితులు నాపై దాడి చేస్తున్నారు; దయలేని మనుష్యులు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు వారు దేవుడంటే గౌరవం లేని మనుష్యులు. సెలా 4 ఖచ్చితంగా దేవుడే నాకు సహాయం; ప్రభువే నన్ను సంరక్షించేవారు. 5 నన్ను దూషించే వారు భయంతో వెనుకకు మరలి వెళ్లిపోవాలి; మీ నమ్మకత్వాన్ని బట్టి వారిని నిర్మూలం చేయండి. 6 యెహోవా, నేను మీకు స్వేచ్ఛార్పణలు అర్పిస్తాను; మీ నామాన్ని స్తుతిస్తాను, ఎందుకంటే అది మంచిది. 7 మీరు ఇబ్బందులన్నిటి నుండి నన్ను విడిపించారు, నా కళ్లు నా శత్రువుల మీదికి విజయోత్సాహంతో చూశాయి.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate