Menu

కీర్తనలు 87

OTSA

1 యెహోవా తన పట్టణాన్ని పరిశుద్ధ పర్వతంపై స్థాపించారు. 2 యాకోబు ఇతర నివాసాలన్నిటికంటె యెహోవా సీయోను గుమ్మాలను ఎక్కువగా ప్రేమిస్తారు. 3 దేవుని పట్టణమా, నీ గురించి గొప్ప విషయాలు చెప్పబడ్డాయి. సెలా 4 “నేను రాహాబు బబులోనును నన్ను గుర్తించిన వారిగా లెక్కిస్తాను అలాగే ఫిలిష్తియా, తూరు కూషు కూడా, ‘ఇది సీయోనులో పుట్టింది’ " అని వారంటారు. 5 నిజమే, సీయోను గురించి ఇలా అంటారు, “ఇది అది కూడా ఆమెలోనే జన్మించాయి, మహోన్నతుడు తానే సీయోనును స్థాపిస్తారు." 6 యెహోవా పౌరుల పేర్లు నమోదు చేసేటప్పుడు “ఇది సీయోనులో జన్మించింది” అని గుర్తిస్తారు. సెలా 7 వారు వాయిద్యాలు వాయిస్తుండగా, “నా ఊటలన్నీ మీలోనే ఉన్నాయి” అని వారు పాడతారు.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate