Menu

కీర్తనలు 98

OTSA

1 యెహోవాకు క్రొత్త పాట పాడండి, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేశారు; ఆయన కుడిచేయి ఆయన పవిత్రమైన బాహువు విజయాన్ని కలిగిస్తాయి. 2 యెహోవా రక్షణను వెల్లడించారు. దేశాల ఎదుట తన నీతిని వెల్లడించారు. 3 ఇశ్రాయేలుకు తన ప్రేమను నమ్మకత్వాన్ని చూపాలని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు; మన దేవుని రక్షణ భూమ్యంతాల వరకు కనపడింది. 4 భూ సమస్తమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయి, సంగీతంతో ఉత్సాహ గానం చేయి; 5 వీణతో యెహోవాకు సంగీత నాదం చేయి, వీణతో, గాన ధ్వనితో, 6 బూరలు, పొట్టేలు కొమ్ము ఊదుతూ, రాజైన యెహోవా ఎదుట ఆనంద ధ్వనులు చేయి. 7 సముద్రం, అందులో ఉన్నదంతా, లోకం, అందులో జీవించేవారంతా ప్రతిధ్వని చేయును గాక. 8 యెహోవా సన్నిధిలో నదులు చప్పట్లు కొడతాయి. పర్వతాలు ఆనందంగా పాడతాయి. 9 యెహోవా లోకానికి తీర్పరిగా, రాజుగా రాబోతున్నారు. ఆయన పరిపాలన ఆయన తీర్పులు న్యాయసమ్మతమైనవి.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate