Menu

పరమ 7

OTSA

1 ఓ రాకుమారుని కుమార్తె! చెప్పులతో మీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి! మీ అందమైన కాళ్లు ఆభరణాలు వంటివి, నైపుణ్యం కలిగిన హస్తకళాకారుని పని. 2 నీ నాభి గుండ్రని ఒక మద్యపాన పాత్ర అందులో ద్రాక్షరస మిశ్రమం ఎప్పుడూ కొరతగా ఉండదు. నీ నడుము తామరల చేత చుట్టబడిన గోధుమ రాశిలాగ ఉంది. 3 నీ స్తనములు రెండు జింక పిల్లల్లా ఉన్నాయి, దుప్పి కవల పిల్లల్లా ఉన్నాయి. 4 నీ మెడ దంతపు గోపురం లాంటిది. మీ కళ్లు బాత్-రబ్బీం ద్వారం దగ్గర ఉన్న హెష్బోను కొలనులాంటివి. మీ ముక్కు దమస్కు వైపు చూస్తున్న లెబానోను గోపురం లాంటిది. 5 నీ శిరస్సు కర్మెలు పర్వతము. నీ శిరోజాలు రాజు ధరించే ఊదా వస్త్రంలా ఉన్నాయి; వాటి చుట్టలో రాజు బందీగా పట్టుబడ్డాడు. 6 నా ప్రియులారా, నీకు ఆనందకరమైన వాటితో, నీవు ఎంత అందంగా ఉన్నావు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నావు. 7 నీ రూపం తాటి చెట్టులా నీ స్తనములు గెలల్లా ఉన్నాయి. 8 నేనన్నాను, “నేను తాటి చెట్టు ఎక్కుతాను; దాని ఫలములు పట్టుకుంటాను.” నీ స్తనములు ద్రాక్షవల్లికి ఉండే ద్రాక్ష గెలల్లా ఉండును గాక. నీ శ్వాస యొక్క పరిమళం ఆపిల్ పండ్ల వాసనలా ఉంది. 9 నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షరసంలా ఉంది. యువతి ద్రాక్షరసం పెదవులు పళ్ల మీదుగా సున్నితంగా ప్రవహిస్తూ నా ప్రియుని దగ్గరకు వెళ్లును గాక. 10 నేను నా ప్రియుని దానను, ఆయనకు నా పట్ల వాంఛ. 11 నా ప్రియుడా, రా, మనం గ్రామీణ ప్రాంతాలకు వెళ్దాము, గ్రామాల్లో రాత్రి గడుపుదాము. 12 ప్రొద్దున్నే లేచి, ద్రాక్ష తోటలకు వెళ్లిపోదాం ద్రాక్షవల్లులు చిగిర్చాయేమో, పూలు పూచాయేమో, దానిమ్మ చెట్లు పూతకు వచ్చాయేయో, చూద్దాము రా! అక్కడ నా ప్రేమ నీకు వ్యక్తం చేస్తాను. 13 పుత్రదాత ఫలం సువాసన ఇస్తున్నది, నా ప్రియుడా, మా ద్వారబంధాల దగ్గరే అనేక రకాల శ్రేష్ఠఫలాలున్నాయి, నీకోసం వాటిని దాచి వుంచాను, క్రొత్తవి పాతవి అందులో ఉన్నాయి.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate