Menu

కీర్తనలు 124

OTSA

1 మనుష్యులు మనపై దాడి చేసినప్పుడు వారి కోపం మనపై రగులుకొన్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే వారు మనల్ని సజీవంగానే మ్రింగివేసేవారు; వరద మన మీదుగా పొర్లి ఉండేది, జలప్రవాహం మనల్ని ముంచేసి జలప్రవాహాల పొంగు మనల్ని తుడిచిపెట్టి ఉండేది అని ఇశ్రాయేలు చెప్పును గాక. 6 వారి పళ్లు మనల్ని చీల్చివేయటానికి అనుమతించని యెహోవాకు స్తుతి చెల్లును గాక. 7 వేటగాని ఉరి నుండి పక్షి తప్పించుకున్నట్లుగా మనం తప్పించుకున్నాము; ఉరి తెగిపోయింది, మనం తప్పించుకున్నాము. 8 భూమ్యాకాశాలను సృజించిన యెహోవా నామంలోనే మనకు సహాయం లభిస్తుంది.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate