Menu

కీర్తనలు 125

OTSA

1 యెహోవాపై నమ్మకము ఉంచేవారు కదిలించబడకుండా నిలిచి ఉండే సీయోను పర్వతంలా నిత్యం నిలిచి ఉంటారు. 2 యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు, ఇప్పుడు ఎల్లప్పుడు యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటారు. 3 నీతిమంతులకు కేటాయించబడిన భూమి మీద దుష్టుల రాజదండం మీద నిలిచి ఉండదు, లేకపోతే నీతిమంతులు పాపం చేయడానికి తమ చేతులను ఉపయోగిస్తారు. 4 యెహోవా, మంచివారికి యథార్థ హృదయం గలవారికి మేలు చేయండి. 5 అయితే యెహోవా వంకర త్రోవలకు తిరిగేవారిని దుష్టులతో పాటు బహిష్కరిస్తారు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate